Skip to playerSkip to main content
  • 2 months ago
JC Prabhakar Reddy Complained to Collector : అనేక అక్రమాలకు పాల్పడిన కేతిరెడ్డి పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్​కు ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి అక్రమాలపై విజిలెన్స్​ అధికారులు ఇచ్చిన నివేదికలను జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురంలో కలెక్టర్​కు ఇచ్చారు. పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా జాప్యం జరుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. సజ్జలదిన్నెలో భూమి ఆక్రమించాడని, మున్సిపల్ రిజర్వ్ స్థలంలో ఇల్లు నిర్మాణం చేశాడని వీటిపై అధికారులు విచారణ నిర్వహించి నిర్దారించారని కలెక్టర్​కు వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడినట్లుగా అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోడం లేదని ప్రశ్నించారు. తన ఫిర్యాదుపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. మరోవైపు డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నిరసనకు యాడికిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి పిలుపునిచ్చారు. దీంతో తాడిపత్రి నుంచి పెద్దారెడ్డిని వెళ్లకుండా ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు.

Category

🗞
News

Recommended