Skip to playerSkip to main content
  • 1 week ago
Sahasra Bharatanatyam Debut in Boston : గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన లింగిశెట్టి సుప్రియ, రామ్ దంపతుల కుమార్తె సహస్ర అరుదైన ఘనత సాధించింది. అమెరికాలోని బోస్టన్ నగరంలో ఆమె భరతనాట్యం అరంగేట్రం చేసింది. ఈ నెల 5న ఈ నాట్య ప్రదర్శన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. సరస నాట్య అకాడమీ నిర్వాహకురాలు, ప్రముఖ గురువు శ్రీమతి ప్రీతి రమేశ్ శిక్షణలో సహస్ర తన అద్భుత ప్రదర్శనతో అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది.ప్రస్తుతం 14 ఏళ్ల వయసున్న సహస్రకు భరతనాట్యం అంటే ఎంతో ప్రాణం. ఆ ఇష్టంతోనే తన ఆరేళ్ల వయసు నుంచే ఆమె నాట్యంలో కఠోర శిక్షణ తీసుకుంటోంది. సహస్ర బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అటు చదువుల్లోనూ ఎప్పుడూ టాపర్‌గానే నిలుస్తుందని తల్లిదండ్రులు తెలిపారు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలలోని పలు ఘట్టాలపై ఆమె ఏకపాత్రాభినయం చేస్తుంది. తన అసాధారణ ప్రతిభతో సహస్ర ఇప్పటికే ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకుంది. విదేశాల్లో ఉంటూ మన భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటుతున్న సహస్రను పలువురు అభినందిస్తున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.
Comments

Recommended