Skip to playerSkip to main content
  • 4 weeks ago
Farmer Falls into Guntakal Branch Canal Along with Bullock Cart : అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కల వద్ద మంగళవారం ఘోర ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన నాగేంద్ర అనే రైతు తన పొలం పనులు ముగించుకుని ఎద్దుల బండి పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గమధ్యంలో గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ (GBC) సమీపంలోకి రాగానే ఎద్దులు ఒక్కసారిగా బెదిరిపోయాయి. ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఎద్దులు, బండితో సహా కాలువలోకి వెళ్లినట్లు రైతు తెలిపారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఎద్దులు, బండితో పాటు రైతు నాగేంద్ర కూడా నీటిలో మునిగిపోతూ ప్రాణాలకై కొట్టుమిట్టాడారు. ఎద్దులతో పాటు నీటిలో మునిగిపోతున్న రైతు నాగేంద్రను స్థానికులు సురక్షితంగా కాపాడారు. అనంతరం ఎద్దులను, బండిని నీటి నుంచి స్థానికులు బయటకు తెచ్చారు. స్థానికుల అప్రమత్తత, సమయస్ఫూర్తితో ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

Category

🗞
News
Transcript
00:01I

Recommended