Skip to playerSkip to main content
  • 1 week ago
Chandrababu Naidu Handri Neeva Jalaharati : కుప్పం నియోజకవర్గంలోని గుండిశెట్టిపల్లెలో హంద్రీనీవా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి ఇచ్చారు. తమ ప్రాంతానికి తరలివచ్చిన జలాలను చూసేందుకు జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ వద్దకు తరలివచ్చిన సీఎం చంద్రబాబుకు స్థానిక మహిళలు కోలాటం ఆడుతూ స్వాగతం పలికారు. అనంతరం హారతులు ఇచ్చారు. పెద్దఎత్తున తరలివచ్చిన జనానికి ముఖ్యమంత్రి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతంరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పూజలు నిర్వహించారు. తర్వాత కాలువ వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు హంద్రీనీవా జలాలకు పసుపు, కుంకుమలు సమర్పించి జలహారతి ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన నీటి కరవుకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కృష్ణా జలాలను కుప్పానికి తీసుకొచ్చిందని సీఎం అన్నారు. కుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గంలో నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృష్ణా జలాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుల్లో నింపేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.

Category

🗞
News

Recommended