Skip to playerSkip to main content
  • 7 minutes ago
Tribals Crossing Dangerous Streams In Alluri District :  అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ప్రమాదకరంగా పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారిక హెచ్చరికలు ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల కోసం లేదా తమ సొంత గ్రామాలకు వెళ్లడం కోసం కొందరు ప్రజలు ఉప్పొంగుతున్న వాగులను దాటేందుకు సాహసం చేస్తున్నారు. పెదబయలు మండలం జమిగూడ పంచాయతీ పరిధిలోని ప్రజలు నిత్యావసరాల కోసం తాత్కాలిక తెప్పలను ఉపయోగించి ప్రమాదకరంగా వాగులను దాటుతున్నారు. ముంచంగిపుట్టు మండలంలో ఒక వ్యక్తి కార్లపోడురు వాగును దాటేందుకు ప్రయత్నించగా, వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. అయితే ఒక కర్ర సహాయంతో ఒడ్డుకు చేరుకోగలిగాడు. కుమడ, తుడుమురాయి వద్ద వంతెనలపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. అనేక గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. జి. మాడుగుల మండలంలోని వీరానికి వెళ్లే వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో వ్యవసాయ పొలాలు జలమయమయ్యాయి. పాడేరు, జి. మాడుగుల, చింతపల్లిని కలిపే మార్గం మూసివేశారు. నిత్యావసర సరుకుల కోసం వారపు సంతలపై ఆధారపడే గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Category

🗞
News
Transcript
00:10Hey
00:11Hey
00:12Hey, dang darah, dang darah, dang darah, dang darah
00:18***
00:21***
00:22***
00:22***
00:23***
00:33What's going on in the Begalu?

Recommended