Skip to playerSkip to main content
  • 11 minutes ago
Fire Breaks out Two Wheeler in Kurnool District : కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో ద్విచక్ర వాహనం దగ్దం అయింది. పల్సర్ బైక్​లో చెలరేగిన మంటల నుంచి ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడ్డారు. పెద్దమారిడు గ్రామానికి చెందిన రఫీ, తన స్నేహితుడితో కలిసి కర్నూలు ఆసుపత్రికి వెళ్తున్నారు. అంతకుముందు గూడూరులోని పెట్రోల్‌ బంక్‌లో పెట్రోల్ వేయించుకుని వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌లో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా పొగలు రావడం గమనించిన రఫీ వెంటనే బైక్​ను నిలిపివేశాడు. కొద్దిసేపటికే మంటలు వ్యాపించి ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరూ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బైక్‌లో మంటలు చెలరేగడానికి అనేక రకాల సాంకేతిక, నిర్వహణ లోపాలు కారణమవుతాయి. ఇందులో ఇంధన లీకేజీలు, షార్ట్ సర్క్యూట్, ఇంజిన్ ఓవర్ హీటింగ్, నకిలీ విడిభాగాలు, బ్యాటరీ లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడం వంటి కారణాలతో ద్విచక్ర వాహనాలు దగ్దం అవుతాయి.

Category

🗞
News
Transcript
00:02This video is brought to you by S.T.A.L.A.N.

Recommended