Cannabis Plant Spotted In Osmania University : ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి మొక్క కనిపించడంతో కలకలం రేపింది. విద్యార్థులు చదువుకునే ప్రాంగణంలో గంజాయి మొక్క ఎలా పెరిగిందన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొక్క సహజంగా మొలిచిందా? లేక ఎవరైనా కావాలనే నాటారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఎవరైనా గంజాయి సిగరెట్ లేదా విత్తనాలను పడేయడం వల్ల మొక్క మొలిచి ఉండొచ్చన్న అభిప్రాయాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. అయితే క్యాంపస్‌లో ఇలాంటి మొక్కలు మరెక్కడైనా ఉన్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు క్యాంపస్‌లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని విద్యార్థులు, పలువురు కోరుతున్నారు. దీనివల్ల యూనివర్సిటీపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గంజాయి మొక్క అక్కడికి ఎలా వచ్చిందన్న విషయంపై యూనివర్సిటీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.