Skip to playerSkip to main content
  • 7 minutes ago
Devotees Rush at Vadapalli Temple : కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. ఏడు శనివారాలు నోము నోచుకునే భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిక్కిరిసింది. వేద పండితులు స్వామి వారికి సుప్రభాత సేవ, మంత్రపుష్పం, లక్ష్మీ హోమాన్ని నిర్వహించారు. భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీతో ఆలయం నిరంతరం కోలాహలంగా ఉంటుంది. ఏడు శనివారాలు వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసి, ప్రదక్షిణలు చేస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. శనివారాలు భక్తి శ్రద్దలతో స్వామివారిని కొలుస్తారు. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయంలో భక్త జనసందోహం అధికంగా ఉంటుంది. భగవంతుని నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయశాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   

Category

🗞
News
Transcript
00:00music
00:08music
00:09music
01:08Please visit www.fema.org
01:39Satsang with Mooji
01:40Let's go, let's go, let's go, let's go.

Recommended