Skip to playerSkip to main content
  • 2 days ago
Lifeguards saved family from drowning : విశాఖపట్నం సముద్ర తీరంలో బుధవారం ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అలల తాకిడికి సముద్రంలో మునిగిపోతున్న నలుగురు పర్యాటకులను లైఫ్‌గార్డ్ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షితంగా రక్షించారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరుకు చెందిన ఒక కుటుంబం విహారయాత్ర కోసం విశాఖపట్నం వచ్చింది. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి సరదాగా సముద్ర స్నానానికి దిగారు. అయితే ఒక్కసారిగా వచ్చిన బలమైన అలల తాకిడికి వారి కుటుంబంలోని ఒక బాలుడు సముద్రంలోకి కొట్టుకుపోసాగాడు. కళ్లెదుటే బాలుడు మునిగిపోతుండటం గమనించిన కుటుంబ సభ్యులలోని మరో ముగ్గురు అతడిని కాపాడేందుకు సముద్రంలోకి వెళ్లారు. కానీ అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆ ముగ్గురు కూడా నీటి ఉద్ధృతికి చిక్కుకుని మునిగిపోవడం ప్రారంభించారు. ఒడ్డున ఉన్న పర్యాటకులు ఆందోళనతో కేకలు వేయడంతో తీరంలో విధుల్లో ఉన్న లైఫ్‌గార్డ్‌ బృందం తక్షణమే అప్రమత్తమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకి, ప్రాణాలకై కొట్టుమిట్టాడుతున్న నలుగురిని చాకచక్యంగా పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తమ వారి ప్రాణాలు దక్కడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడిన లైఫ్‌గార్డ్‌ సిబ్బందిని పోలీసులు, అక్కడి పర్యాటకులు ప్రత్యేకంగా అభినందించారు.  

Category

🗞
News
Transcript
00:00.
00:00.
00:00.
00:00.
00:00.
00:02.
00:27It's a big one.
00:27Step on the leg.
01:17This means that people are with no signs.
01:18they are pulled into our phones,
01:18who to receive the services,
01:19who to our customers,
01:19or to support their guests.
01:20This means that they are an amazing person.
01:21They are showing a tremendous amount of money.
01:21And they are coming for their eyes.
01:21They are being supported by their employees.
01:21They are making great comments for their community,
01:22to support their activities.
01:25Of course, they are making great decisions for their families.
01:27You

Recommended