Vote Themed Sand Sculpture Draws Attention: ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు బహుమతులు, డబ్బు, మద్యం భారీగా పంచిపెడ్తారు. అటువంటి వాటికి లొంగకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ దిశగా అందర్నీ చైతన్య పరచడానికి అక్కాచెల్లల్లు ఓ ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తూర్పు గోదావరి జిల్లా రంగంపేటలో సైకత శిల్పం ద్వారా చక్కటి సందేశాన్నిచ్చారు. సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత దీన్ని రూపొందించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆ సైకత శిల్పం వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు తావులేకుండా పారదర్శకంగా ఓటు హక్కును వినియోగించుకోవాలనే నినాదంతో సైకతాన్ని వారు తీర్చిదిద్దారు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ఓటు వేయాలని వారు సైకత శిల్పం ద్వారా చాటిచెప్పారు.
Comments