Palamaner YSRCP Candidate Suspend : చిత్తూరు జిల్లా పలమనేరులో మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయి, ఓటర్లను తిరిగి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 'నేను చేసిన తప్పేంటి అన్నా.. నన్ను సస్పెండ్ చేయడం ఎంత వరకు సమంజసమన్నా అన్నా’ అని వైఎస్సార్సీపీ తరఫున కౌన్సిలర్‌గా పోటీచేసి ఓటమి చవిచూసిన ప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. తన వద్ద డబ్బులు తీసుకొని ఓటు వేయకపోవడంతో తాను ఓడిపోయానని, వాటిని తిరిగి ఇవ్వాలని ఆయన బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రకటించారు. దీనిపై ప్రసాద్‌రెడ్డి గురువారం స్పందించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎన్నికల నిబంధనల ప్రకారం రూ.7.5 లక్షలు ఖర్చు చేశానని, మరో రూ.2.5 లక్షలు స్నేహితుల భోజనాలు, రవాణాకు ఇచ్చానన్నారు. కష్టపడి పనిచేసిన నన్ను ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. పార్టీ కోసం కష్టపడేవారిని వదులుకోవద్దని సూచించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు.
Comments