• 35 minutes ago
పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి నాణ్యమైన క్యాన్సర్ చికిత్సలు అందించటమే లక్ష్యమని బసవతారకం ఇండో అమెరిక్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. మానవీయ డెవలప్​మెంట్ అండ్ పైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు సీఎస్ఆర్ నిధులతో అందించిన బస్సును బాలయ్య ప్రారంభించారు. బసవతారకం ఆస్పత్రి గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ పరీక్షలను మొబైల్ బస్సులో నిర్వహిస్తోంది. వీటితో పాటు ఆయా ప్రాంతాలకు వైద్యులు, సిబ్బంది వెళ్లేందుకు వీలుగా ఈ బస్​ని అందుబాటులోకి తీసుకు రావటం విశేషం. మానవీయ డెవలప్​మెంట్ ఎండీ డాక్టర్​ గౌరి శంకర్​తో కలిసి బాలయ్య జెండా ఊపి బస్సును ప్రారంభించారు. 28 సీటర్ల ఈ బస్సులో స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించే వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది గ్రామీణ ప్రాంతాలకు వెళ్లనున్నారు. క్యాంపులకు వెళ్లే సిబ్బంది కోసం సొంత బస్సును వినియోగించడం ద్వారా ఆస్పత్రికి అద్దె మిగులుతుందని వివరించారు. క్యాన్సర్ మహమ్మారిని అరికట్టడానికి సంస్థ చేస్తున్న ప్రయత్నాలకు సహకారం అందించిన దాతలకు బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. 

Category

🗞
News
Transcript
00:00What

Recommended