• 17 minutes ago
MPP Dispute in Singanamala : రాష్ట్రంలో ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని మండలాల్లో కూటమి, వైఎస్సార్సీపీ బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. ఎలాగైనా మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాన్ని దక్కించుకోవాలని రెండు పార్టీలూ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. స్వతంత్రులుగా గెలిచిన ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అనంతపురం జిల్లా శింగనమల ఎంపీడీఓ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంపీపీ అభ్యర్థి ఎంపిక విషయంలో వైఎస్సార్సీపీ, టీడీపీ ఎంపీటీసీల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్‌ కార్యకర్తలతో కలిసి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే కార్యాలయంలోకి వెళ్లేందుకు ఆయన యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో శైలజానాథ్​ గొడవకు దిగారు. ఎంపీపీ ఎన్నికలో పాల్గొనేందుకు తమ పార్టీ ఎంపీటీసీ సభ్యులను అనుమతించాలని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కార్యకర్తలతో కలిసి ఆయన కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నించారు.

Category

🗞
News
Transcript
00:02Oh
00:31Oh
00:32Oh
00:33Oh
01:00This is a miracle our freedom.
01:01This is a miracle!
01:04This is a miracle!
01:05This is miracle!
01:06If we do not get it, we will make it!
01:08In the last miracle, we have to live for!
01:11The miracle will be here!
01:16We are living in a miracle!

Recommended