Skip to playerSkip to main content
  • 1 week ago
11 Feet Python Found at Mangalagiri : మంగళగిరిలో సుమారు 11 అడుగుల భారీ కొండ చిలువ కలకలం రేపింది. జనావాసాల్లోకి అంత పెద్ద పాము రావడంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. సుమారు 11 అడుగుల పొడవు ఉన్న భారీ కొండ చిలువను బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత పెద్ద కొండ చిలువను మును పెన్నడూ చూడలేదని స్థానికులు చెప్పారు. ఇంకా వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యతని, కొండ చిలువలను ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదని స్నేక్ క్యాచర్ హితవు పలికారు. ఇళ్ల మధ్యలో కానీ, స్థలాల్లో కానీ పాములు కనిపిస్తే ప్రజలు భయపడకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కోరారు. బంధించిన కొండ చిలువను నిర్మానుష్య కొండ ప్రదేశంలో వదిలేయనున్నట్లు స్నేక్ క్యాచర్ పేర్కొన్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you so much for watching.
Comments

Recommended