Rains and Weather Updates in AP: రాష్ట్రంపై తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుంది. బుధవారం రాత్రి ఇది కలింగపట్నం తీరం దాటింది. దీని ప్రభావం మరో 12 గంటలపాటు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. ఉత్తరాంధ్రతోపాటు వివిధ జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైెంది. ఈ రాత్రికి తీవ్ర వాయుగుండం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు జిల్లాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు కురిసిన వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలు డెఫిసిటీ నుంచి సాధారణ స్థితికి చేరుకుంది. ఇంకా ఒకట్రెండు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలుపుతున్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగిపోతున్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, ప్రభావం మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.