Skip to playerSkip to main content
  • 4 minutes ago
Danam About Khairatabad By Election : ఖైరతాబాద్ నియోజకవర్గంపై ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రభావం ఉండదని మాజీ మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ఖైరతాబాద్​లో జరగబోయే ఉప ఎన్నికలో దిమ్మతిరిగే ఫలితం వస్తుందన్నారు. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో అలా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం నెక్లెస్‌ రోడ్డులో సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో దానం నాగేందర్‌ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. ఎన్నికల కమిషనర్​ జ్ఞానేశ్​కుమార్​తో పాటు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిపై దానం పలు ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోందని ఆయన​ ఆక్షేపించారు. పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కిషన్​రెడ్డి సైతం ఓటు చోరీతోనే గెలుపొందారని విమర్శించారు. సీఈసీ జ్ఞానేశ్​కుమార్ వెంటనే రాజీనామా చేయాలని దానం డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం అంశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా తీసుకొని విచారించాలని ఆయన కోరారు.  

Category

🗞
News

Recommended