GOVT Diet College In Karimnagar : కరీంనగర్‌లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో(డైట్) ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్న గుర్రం మహేశ్వర్ రెడ్డి గురువారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మహేశ్వర్ రెడ్డికి అరుదైన కానుకను అందజేశారు. నూతన ఎలక్ట్రిక్ కారును బహుమతిగా అందజేసి తమ గురువు కళ్లల్లో ఆనందాన్ని చూసి ఆస్వాదించారు. తమ జీవితాలను సరైన మార్గంలో నిలిపారని సత్కార వేదికపై నుంచి మోసుకు వచ్చి కారులో కూర్చోబెట్టారు. పూర్వవిద్యార్థలు మాట్లాడుతూ తమ గురువుగారికి ఇది చాలా చిన్న కానుక అని, ఈ అవకాశం వచ్చినందుకు చాలా గర్వపడుతున్నట్లు చెప్పారు. యూట్యూబర్ అనిల్ కూడా పూర్వవిద్యార్థుల్లో ఉన్నారు. తన విద్యార్థులు చూపిన అభిమానానికి ఆ మాస్టారు భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుక కోసం చాలా మంది తమ వంతు సాయం అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, వరంగల్, నిజామాబాద్ డైట్ కాలేజీల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు.