Skip to playerSkip to main content
  • 11 minutes ago
Water Level Drops In Singuru Project : ఎల్​నినో ప్రభావంతో నైరుతి తీవ్ర నిరాశ మిగల్చగా వర్షాభావ పరిస్థితులు ఎదురయ్యాయి. వరద నీరు చేరకపోవడంతో నీటిమట్టాలు రోజురోజుకు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో సాగు, తాగునీటి ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్ట్​లన్నీ మైదానాలను తలపిస్తున్నాయి. అడుగంటిన భూగర్భజలాలతో బోరుబావులు ఎండిపోతుండటం కలవరపెడుతోంది. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయమే ఇందుకు ఉదాహారణ. ఈ ప్రాజెక్టు నిత్యం 30 టీఎంసీలతో కళకళలాడుతూ హైదరాబాద్ దప్పిక తీర్చేది. కానీ ప్రస్తుతం 3 టీఎంసీలకు నీటి మట్టాలు పడిపోవడంతో ప్రాజెక్టులో గుంతలు తేలాయి. రిజర్వాయర్ ఆనకట్ట అంచున్న ఉన్న ఓ గుంత హృదయాకారంలో కనిపిస్తోంది. ఇది నీటిమట్టం ఎంతమేరకు తగ్గాయనే సందేశాన్ని చాటిచెబుతోంది. ప్రజలంతా నీటిపై ప్రేమను చూపించాలని, తాగునీటిని పొదుపుగా వాడాలనే సందేశాన్ని ఇస్తున్న దృశ్యాలు ఆలోచింపజేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు బాగా తగ్గాయి. దీంతో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను నగర ప్రజలు అర్థం చేసుకొని నీటి దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని జలమండలి కోరుతోంది.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended