Skip to playerSkip to main content
  • 12 minutes ago
Cyclone Murasu Effect on Bapatla Suryalanka Beach: మురసు తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సూర్యలంక బీచ్‌లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతుండటంతో సముద్రం 50 మీటర్ల ముందుకొచ్చిది. అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. బాపట్లలో 20 సెం.మీ. వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు నీటమునిగాయి. రహదారులపై కూలిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొలగిస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సూర్యలంక చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం: తుపాను హెచ్చరిక నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. నిజాంపట్నంలో పదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. వందల సంఖ్యలో వేట పడవలను సముద్రం నుంచి దూరంగా తెచ్చి నిజాంపట్నం హార్బరు, పేరలి, ఈపూరుపాలెం స్ట్రయిట్‌ కట్‌ కాలువల్లో లంగరు వేశారు.  జిల్లాలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. తుపాను సహాయక చర్యలు  చేపట్టడానికి 30 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం సూర్యలంక చేరుకుంది.

Category

🗞
News
Transcript
00:18This video is brought to you by S.T.A.L.A.

Recommended