Skip to playerSkip to main content
  • 3 hours ago
Cyclone Arnab Hits Yanam Hard : అర్నబ్‌ తుపాను కేంద్రపాలిత ప్రాంతం యానాంపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యానాంలో టంగుటూరి ప్రకాశం పంతులు జూనియర్ కళాశాల, మత్స్య శాఖ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. గోపాల్ నగర్‌లో భవనంపై వేసిన రేకుల షెడ్డు, కళ్యాణ మండపం వద్ద ఉన్న రేకుల షెడ్డు, ఆంజనేయ స్వామి విగ్రహానికి వేసిన రేకుల షెడ్డు గాలులకు ఎగిరిపోయాయి. సుభద్రానగర్, ఓల్డ్ రాజీవ్​నగర్, జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో కూడా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ సిబ్బంది జేసీబీ సహాయంతో పడిపోయిన వృక్షాలను తొలగిస్తున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Category

🗞
News
Transcript
00:02I
00:10was
00:12as
00:12as
00:13as
00:14as
00:14as
00:14as

Recommended