Skip to playerSkip to main content
  • 26 minutes ago
School Gate Wall Danger Condition : హైదరాబాద్​ లంగర్​హౌస్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాల ప్రధాన గేటుకు ఆనుకుని ఉన్న సపోర్టింగ్ గోడకు పగుళ్లు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఏ క్షణంలోనైనా పడిపోయే పరిస్థితి ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దసరా సెలవులకు ముందు పాఠశాల గేటు, గోడ సందులో ఓ కుక్క ఇరుక్కుపోవడంతో హైడ్రా బృందానికి స్కూల్ ప్రధానోపాధ్యాయులు సమాచారం అందించారు. ఆ కుక్కను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా గోడను పగలగొట్టాల్సి వచ్చింది. అయితే అప్పటి నుంచి గోడకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ప్రమాదకరంగా మారిందని స్థానికులు వాపోతున్నారు. గోడ కూలితే విద్యార్థులు, పాఠశాల సిబ్బంది, అటుగా వెళ్లే ప్రజలకు ప్రాణాపాయం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యం వెంటనే గోడకు మరమ్మతులు చేపట్టి, ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. 

Category

🗞
News

Recommended