Celebrities visited Lord Sri Venkateswara Swamy in Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్, సినీ నటుడు అర్జున్ దాస్, ప్రపంచ చెస్ ఛాంపియన్ డి. గుకేశ్ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత వీరికి రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేసి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని సర్వదర్శనం కోసం భక్తులు 11 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. కాగా గురువారం స్వామివారిని 65,218 మంది భక్తులు దర్శించుకోగా 20,213 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ.3.63 కోట్ల ఆదాయం లభించింది.