Skip to playerSkip to main content
  • 11 minutes ago
Farmers Protesting And Demanding Compensation : కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అర్నబ్​ తుపాను కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. తుపాను వల్ల పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం పరిహారం కూడా ప్రకటించిందని తెలిసినప్పటికీ, ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తీర ప్రాంతంలో ఉన్న సుమారు 250 ఎకరాల వ్యవసాయ భూముల్లోకి సముద్రపు అలలు చొచ్చుకురావడంతో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. వరి పొలాలు ఉప్పునీటితో నిండిపోవడంతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. కనీసం ఒక్క గింజ కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఈ భారీ నష్టంతో కుంగిపోయిన రైతులు ప్రత్యేక పరిహారం కోసం డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన యు. కొత్తపల్లి సబ్ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్​, తహసీల్దార్ చిన్నారావు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తమ నిరసనను విరమించారు.

Category

🗞
News
Transcript
00:00I
00:34The government did not need a government to do the government.
00:39Well, it was the government.

Recommended