Skip to playerSkip to main content
  • 19 minutes ago
Street Bull Fight On Road : కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని అత్యంత రద్దీగా ఉండే తాటిపాక సెంటర్‌లో రెండు ఆంబోతులు నడిరోడ్డుపై వీరంగం సృష్టించాయి. నువ్వా-నేనా అన్న రీతిలో అవి తలపడటంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రధాన రహదారిపై ఒక్కసారిగా ఎదురుపడిన ఈ రెండు ఆంబోతులు, కొమ్ములతో ఒకదానినొకటి బలంగా ఢీకొట్టుకుంటూ భీకరంగా పోటీపడ్డాయి. అవి చెలరేగిపోతున్న తీరు చూసి దారిన వెళ్లే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను వదిలేసి ప్రాణభయంతో పక్కకు పరుగులు తీశారు. ఆంబోతుల ఉద్ధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో, వాటి దగ్గరికి వెళ్లి విడిపించేందుకు స్థానికులు ఎవరూ సాహసించలేకపోయారు.సుమారు కొంతసేపు నడిరోడ్డుపై జరిగిన ఈ 'బుల్ ఫైట్' కారణంగా తాటిపాక సెంటర్‌లో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ తమపైకి దూసుకొస్తాయోనని చుట్టుపక్కల దుకాణదారులు, ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ భీకర పోరాటానికి సంబంధించిన దృశ్యాలను కొందరు స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిత్యం రద్దీగా ఉండే కూడళ్లలో పశువుల సంచారంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Category

🗞
News

Recommended