Minister Kandula Durgesh Cleaning Roads : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. నిడదవోలులో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఏక్ దిన్, ఏక్ గంట, ఏక్ సాత్ శ్రమదాన కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికుడిలా మారిన మంత్రి చీపురు పట్టుకొని రహదారులను శుభ్రం చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు మంత్రితో కలిసి రహదారులను తుడిచారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ప్రతిరోజు ఒక థీమ్‌తో కార్యక్రమాలను అమలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని మంత్రి దుర్గేశ్ అన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని స్వచ్ఛతగా రూపొందించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించారన్నారు. ప్రజలను చైతన్యపరిచేలా స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమాలు ఉంటాయని మంత్రి వివరించారు.