Skip to playerSkip to main content
  • 6 minutes ago
Vijayawada Utsav 2.0 Came To An End : విజయవాడ ఉత్సవాల్లో తొమ్మిదో రోజు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. పున్నమి ఘాట్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు విభిన్న నృత్య రూపాలు ప్రదర్శించి ఆహ్లాదాన్ని పంచిపెట్టారు. ఉత్సవాల్లో భాగంగా క్యాస్ట్ చిత్ర యూనిట్ సందడి చేసింది. టీజర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో జగన్, యాంకర్ రవి, సత్యం రాజేష్, రంగం ఫేమ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రేక్షకులతో మాట్లాడించి ఉత్సవాలకు కొత్త జోష్ తీసుకువచ్చారు.నేటితో విజయవాడ ఉత్సవ్ 2.0 ముగింపు దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రం 5.30కు ఏలూరు రోడ్డులోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద భారీ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. రెండు వేలమంది కళాకారులతో ప్రదర్శనలు కనువిందు చేయనున్నారు. వివిధ కళారూపాలు, జానపద నృత్యాలతో కార్నివాల్ సందడిగా జరగనుంది. ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి విశాలాంధ్ర రోడ్డు మీదుగా ఐజీఎం స్టేడియం వరకు ర్యాలీ కూడా నిర్వహించనున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for listening.

Recommended