Rising Water Level Of Godavari River : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతుంది. ఆదివారం ఉదయం 7 గంటలకు గోదావరి నీటిమట్టం 40 అడుగులు దాటి ప్రవహిస్తోంది. రెండు రోజుల క్రితం 17 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం, శనివారం సాయంత్రానికి 25 అడుగులకు పెరిగింది.ప్రస్తుతం 40 అడుగులు దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతంలోని చాలా మెట్లు వరద నీటిలో మునిగాయి. స్నాన ఘట్టాల్లోని విద్యుత్ స్తంభాల వరకు వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.