Margadarsi MD Sailaja Kiron on Reddigunta Pond : చిత్తూరు నగరంలోని రెడ్డిగుంట చెరువు అభివృద్ధి పనులకు ఇవాళ మార్గదర్శి చిట్‌ఫండ్ ఎండీ శైలజా కిరణ్ భూమి పూజ చేసి ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా రెడ్డిగుంట చెరువును అభివృద్ధి చేయడానికి చిత్తూరు కలెక్టర్ అనుమతిచ్చారని శైలజా కిరణ్ తెలిపారు. ఈ మేరకు చెరువు చుట్టూ ప్రహరీ, వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంపొందించనున్నట్లు ఆమె వివరించారు. చిత్తూరు నగర ప్రజలు ఒక ఆహ్లాదకర వాతావరణంలో గడపడానికి అవసరమైన సౌకర్యాలు చెరువులో చేపట్టనున్నట్లు శైలజా కిరణ్ వెల్లడించారు. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళిమోహన్, గురజాల జగన్ మోహన్, నెక్ కేంద్ర కమిటీ సభ్యులు రమేశ్‌బాబు, బాలాజీ హేచరీస్ ఎండీ నీరజ, డైరెక్టర్ ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.