Skip to playerSkip to main content
  • 10 minutes ago
Kalanjali Fashion Show at Mohan Babu University: తిరుపతి శివారులోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కళాంజలి ఫ్యాషన్ షో అలరించింది. మోహన్ మంత్ర - 2026లో భాగంగా కళాంజలి ఫ్యాషన్​ షో నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా యువతీయువకులు వివిధ రకాల సంప్రదాయ వస్త్రధారణలో ర్యాంప్ వాక్ చేసి సందడి చేశారు. విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా రంగురంగుల చీరలు, సంప్రదాయ ఆభరణాలు, ఆకర్షణీయమైన వస్త్రధారణతో ప్రదర్శించిన ఫ్యాషన్​ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను చూసి కార్యక్రమానికి హాజరైన అతిథులు, ప్రముఖులు అభినందించారు. విద్యతోపాటు కళాత్మక ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. యువచ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రాలంకరణ చేసుకుని ప్రేక్షకులని అలరించారు. కళాంజలి ఫ్యాషన్​ షో అందర్నీ ఆకట్టుకుంది. కార్యక్రమం జరుగుతున్నంత సేపు యువత ఉర్రూతలూగింది. కళాశాల ఆవరణ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.

Category

🗞
News
Transcript
00:00What
00:52Outro Music
01:02Outro Music

Recommended