Skip to playerSkip to main content
  • 5 minutes ago
100 Years Old Woman Casted Her Vote at Tiruvuru: ఆంధ్రపదేశ్‌లో పుర ఎన్నికల పోలింగ్‌  కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మున్సిపాలిటీలో ఓ శతాధిక వృద్ధురాలు ఓటేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. కుటుంబ సభ్యుల సాయంతో ఆమె వీల్‌ ఛైర్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పోలింగ్‌ కేంద్రానికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మన్యం జిల్లా సాలూరు, కాకినాడ జిల్లా తునిలో సైతం భారీ సంఖ్యలో పోలింగ్​ బూత్​కు వచ్చిన వృద్దులు, దివ్యాంగులు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా ప్రాంతాల యువత, సహా పోలీస్​ సిబ్బంది వృద్దులను పోలింగ్​ బూత్​ వద్దకు ఎత్తుకుని తీసుకెళ్లారు. కొందరు వీల్​ఛైర్​లో వస్తే, మరికొందరు కర్ర సాయంతో నడుస్తూ వచ్చి ఓటు వేశారు. పెద్ద సంఖ్య తమ ఓటుహక్కు వినియోగించుకున్న వృద్దులు నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. శతాధిక వృద్ధులు సైతం తమ నైతిక బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవడం యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

Category

🗞
News
Transcript
00:00To be continued...

Recommended