Floodwater continues to flow into Prakasam Barrage : వరుస తుపాన్ల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని నదులు, జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. వర్షాలు తగ్గినా వరద ప్రవాహాలు మాత్రం తగ్గట్లేదు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. మురసు తుపాను ప్రభావంతో కురిసిన కుండపోత వానాలతో పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో వాగులు పొంగి కృష్ణా నదిలోకి వరద ప్రవాహం చేరుతోంది. 3 రోజుల క్రితం 71 వేల క్యూసెక్కుల ప్రవాహం కృష్ణా నదికి చేరింది. ఈ ఏడాది ఇదే గరిష్ఠ వరద. ఆ తర్వాత క్రమంగా వరద తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటి మట్టం కొనసాగుతోంది. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి 7 వేల 250 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదిలేశారు. సాయంత్రానికి 3 వేల 625 క్యూసెక్కులకు తగ్గింది. కృష్ణా తూర్పు డెల్టాకు 15 వందల 16 క్యూసెక్కులు నీరు వదులుతున్నారు.