Skip to playerSkip to main content
  • 6 minutes ago
Children Repair Road in Nidadavolu : వయసు చిన్నదైనా, చిట్టి చేతులతో.. పెద్ద మనసును చాటుకున్నారు తూర్పుగోదావరి జిల్లా చిన్నారులు. నిడదవోలులోని పట్టణంలోని సంత మార్కెట్ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారి పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపై ఎక్కడిక్కడ భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన సమీపంలో చిన్నారులు తమ చిట్టి చేతులతో పెద్ద పనిని భుజాన వేసుకున్నారు. వెంటనే వారు సమీపంలో అందుబాటులో ఉన్న కంకర రాళ్లను ఏరి చేతుల్లో తీసుకు వచ్చి రోడ్డుపై ఉన్న గుంతల్లో నింపి చదును చేశారు. వయసు చిన్నదైనా ప్రయాణికుల కష్టాలను తీర్చేందుకు ఆ చిన్నారులు చూపిన చొరవ, సామాజిక బాధ్యత అందరినీ కట్టిపడేసింది. చిన్న వయసులోనే పెద్ద మనసు చాటుకుని ఆదర్శంగా నిలిచిన ఆ పిల్లలను స్థానికులు అభినందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00Thank you for joining us.

Recommended