Cake Mixing at Novotel Hotel : క్రిస్మస్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని విజయవాడ నోవాటెల్‌లో శనివారం కేక్ మిక్సింగ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఇందులో డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, ఇతర పానీయాలు కలిపి ప్రత్యేక డబ్బాల్లో పొందుపర్చారు. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు హోటల్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేక కేకుల్లో వీటిని వినియోగిస్తారు. మరోవైపు విజయవాడలోని గ్రాండ్ జీఆర్టీ హోటల్స్‌లో క్రిస్మస్ పండుగ సీజన్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ ట్రీ లైటింగ్, కేక్ మిక్సింగ్ కార్యక్రమాలతో నిర్వాహకులు ఈ సంబరాలకు శ్రీకారం చుట్టారు. ‘లూమీ ది హోప్ ఆఫ్ లైట్’ పేరుతో ప్రత్యేక థీమ్‌ను ఆవిష్కరించారు. ఆశ, సానుకూలతకు ప్రతీకగా నిలిచే బంగారు రంగు మినుగురు పురుగు ‘ది లూమీ’ మస్కట్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిస్మస్ నుంచి నూతన సంవత్సరం వరకు సాగే ఈ వేడుకల్లో అతిథుల కోసం ప్రత్యేక వంటకాలు, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ‘మిక్స్, లైట్, మెర్రీ’ కార్యక్రమం ద్వారా పర్యావరణహిత వేడుకలు నిర్వహిస్తున్నట్లు హోటల్ యాజమాన్యం తెలిపింది.
Comments